Poison Taste | ఔరంగాబాద్: విషం రుచి తెలుసుకోవడానికి బీహార్‌లోని ఐదుగురు బాలికలు చేసిన సాహసం వారిలో నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా మోతీబీగా గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రమాదం నుంచి బయటపడ్డ 14 ఏండ్ల బాలిక కథనం ప్రకారం..12-15 ఏండ్లు ఉన్న ఐదుగురు బాలికల మిత్ర బృందానికి విషం రుచి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో పక్షులను చంపే విషాన్ని తీసుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్లి నీటిలో కలుపుకుని తాగారు. అయితే 14 ఏండ్ల బాలిక మాత్రం కొద్దిగానే తీసుకుంది. పైగా దానిని తాగిన వెంటనే ఊసేసింది. దీంతో కొద్దిగా అస్వస్థత తప్ప ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం రాలేదు.
