Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Valentines Day | ప్రేమికుల దినోత్సవం స్పెషల్.. ప్రేమ యాత్రలకు ఇవే బెస్ట్ డెస్టినేషన్స్..!

Ai generated article, credit to orginal website, February 14, 2026

Valentines Day |ప్రేమికుల దినోత్సవం అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని వేడుక చేసుకోవడం. ఈ ఏడాది వాలెంటైన్స్ డే శనివారం రావడంతో.. సెలవుల గురించి ఆలోచించకుండా ఒక చిన్నపాటి విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. కొందరు ముందే రిజర్వేషన్లు చేసుకుని సిద్ధంగా ఉంటే.. మరికొందరు ఆఫీసు పనుల ఒత్తిడిలోపడి ప్లానింగ్ను ఆఖరి నిమిషం వరకూ వాయిదా వేస్తుంటారు. మీరుకూడా ఆ లాస్ట్ మినిట్ లిస్ట్లో ఉన్నారా? అయినా కంగారేం లేదు! సాధారణంగా వాలెంటైన్స్ డే సందర్భంగా పాపులర్ టూరిస్ట్ ప్రాంతాలన్నీ రట్టిగా ఉంటాయి. కాబట్టి తర్వాతి వీకెండ్ వరకైనా ప్లాన్ చేయండి. రొటీను భిన్నంగా కాస్త ప్రశాంత తను, కొత్తదనాన్ని ఇచ్చే ఈ ప్రదేశాల్లో బిలేటెడ్ ప్రేమికుల దినోత్సవం జరుపుకోండి.
Wayanad
కలర్‌ఫుల్ కేరళ :
ప్రకృతి ఒడిలో సేదతీరాలని అను కునే జంటలకు వాయనాడ్ ఒక స్వర్గధామం. దట్ట మైన అడవులు, ఎత్తయిన కొండలు, రకరకాల వన్య ప్రాణులతో ఈ ప్రాంతం పర్యాటకులను మంత్రము గ్ధులను చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నియోలిథిక్ కాలం నాటి పురాతన గుహలు, అందమైన రిసార్టులు మీ వీకెండ్ను మరింత కలర్ ఫుల్గా మారుస్తాయి. ప్రకృతి ప్రేమికులకు వాయనాడ్ ఫస్ట్ ఛాయిస్ అవుతుంది.
Coorg
సుగంధాల గుబాలింపు:
మీకు కొండలు, పచ్చని ప్రకృతి అంటే ఇష్టమా? అయితే కూర్గ్ ను మించిన మరో ఆప్షన్ లేదు. పశ్చిమ కనుమల్లోని ఈ అందం మైన ప్రాంతంలో ఎటుచూసినా కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల గుబాళింపులు మీకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడి హోమ్ స్టేలు, లగ్జరీ రిసార్టులు మీ ట్రిప్ను మరింత రొమాంటిక్ గా మారుస్తాయి. స్థానిక వంటకాలను రుచి చూస్తూ జలపాతాలు హోరులో మీ భాగస్వామితో గడిపే సమయం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
Tawang
కొత్త లోకం:
మీకు వైట్ వాలెంటైన్స్ డే జరుపుకోవా లని ఉందా? చుట్టూ మంచు కురుస్తుంటే, ఆ మంచులో మీ ప్రియమైన వారితో గడపాలని అను కుంటున్నారా? అయితే వెంటనే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్కు టికెట్స్ బుక్ చేసుకోండి. మంచుతో కూడిన పర్వత శిఖరాలు, నిశ్శబ్దంగా ఉండే లోయలు ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభూ తిని ఇస్తాయి. ఇక్కడి పురాతన బౌద్ధ మఠాలు చూస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నామనే భావన కలుగుతుంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌టాక్షం
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం
  • మ‌హా శివ రాత్రి కోసం శ్రీ‌శైలంలో భారీ భ‌ద్ర‌త‌
  • రూ. 1 ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌
  • స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి బ్ర‌హ్మైక్యం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes