Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Telangana | ప్రాణాలు పోతున్నా పట్టదా.. ప్రభుత్వంపై గౌడన్నల తిరుగుబాటు

Ai generated article, credit to orginal website, February 17, 2026

Telangana | హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : కల్లుగీత కార్మికులపై కాంగ్రెస్‌ సర్కార్‌ అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నది. కులవృత్తిలో భాగంగా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఏటా వం దలాది మంది వృత్తిదారులు ప్రాణాలు కోల్పోతుండగా, అదే స్థాయిలో దివ్యాంగులుగా మారి నరకయాతన అనుభవిస్తున్నారు.
అయి తే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు గాయపడ్డ వారికి తక్షణ సాయం ఇవ్వాల్సిన ప్రభుత్వం రెండేండ్లయినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అనేక హామీలను ఇచ్చి న ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంపై గౌడన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హక్కుల సాధన కోసం పోరుబాట పట్టగా మంగళవారం ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.
నాడు పరిహారం పెంచి ఇచ్చిన బీఆర్‌ఎస్‌
నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదవశాత్తు గీత వృత్తిదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద మృతితో వారి కుటుంబాలు రోడ్డు న పడుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మానవీయకోణంలో గీతకార్మికులకు అండగా నిలిచింది. ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. పాక్షిక వైకల్యానికి రూ.2లక్షలు, పూర్తి వైకల్యానికి రూ.5లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. ప్ర మాదవశాత్తు మృతిచెందితే దహన సంస్కారాలకు 25వేల తక్షణ సహాయం, గాయపడితే 15వేల ఆర్థిక సాయాన్ని అందించింది. 2023లో చివరి సారిగా 312 బాధిత గౌడ కుటుంబాలకు పరిహారం అందజేసింది.
నేడు పట్టించుకోని కాంగ్రెస్‌ సర్కార్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లుగా ఈ స్కీమ్‌ కింద ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 160 మంది గీతకార్మికులు మృత్యవాతపడగా, 180మంది శా శ్వత దివ్యాంగులుగా మారారు. మరో 500 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. మొత్తం 840 బాధితుల కుటుంబాలకు రూ.25కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉన్నది. కానీ రేవంత్‌ సర్కార్‌ మాత్రం రెండేండ్లుగా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
ఒక్క హామీ అమలు చేయలే
ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ నమ్మబలికింది. గీత కార్మికుల పింఛన్‌ను 2వేల నుంచి 4వేలకు పెంచుతామని చెప్పింది. మద్యం షాపుల్లో బీఆర్‌ఎస్‌ కల్పించిన 15% రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతామని ఊదరగొట్టింది. జనగామకు సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెడతామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. రెండేండ్లు గడిచినా ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, ఉ న్నవాటికే మంగళం పాడింది. పరిహారం నిధులను నిలిపేసింది. ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్‌ను మూసివేసింది. నందనంలోని నీరా ప్రాసెస్‌ యూనిట్‌ పనులను నిలిపేసింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ చిన్నచూపే చూస్తున్నదని గౌడ కులసంఘాల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
రెండేండ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించడం లేదు. గతేడాది బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించినా విడుదల చేయలేదు. బాధిత కుటుంబాలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి బడ్జెట్‌లోనూ అన్యాయమే జరుగుతున్నది. విషయాన్ని ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు అనేకమార్లు విన్నవించినా కనీస స్పందన కరువైంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీలను అమలు చేయాలి. ఎక్స్‌గ్రేషియాను తక్షణం చెల్లించాలి. – జకే వీరస్వామిగౌడ్‌,
సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తెలంగాణ రైజింగ్ విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్
  • న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది
  • బ‌రా బ‌ర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్
  • జీవ వైజ్ఞానిక వేదిక‌గా హైద‌రాబాద్ కావాలి
  • ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes