Vemulawada | వేములవాడ, మార్చి 3: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి ఆలయ అధికారులు ఆలయాలను మూసివేశారు.
మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోపు చంద్రగ్రహణం ఉండగా సాయంత్రం సంప్రోక్షణ అనంతరం స్వామివార్లకుప్రదోషకాల పూజ నిర్వహించనున్నారు. తర్వాత ఏడున్నర గంటల నుంచి దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయడంతో భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మానుష్యంగా మారాయి.
Vemulawada Bhimanna Temple2
Vemulawada Bhimanna Temple3
