Indian Richest Billionaires | న్యూఢిల్లీ, మార్చి 11: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 2026 సంవత్సరానికిగాను అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన దేశీయ శ్రీమంతుల జాబితాలో 99.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో రిలయన్స్ అధినేత తన తొలిస్థానాన్ని పదిలపరుచకున్నట్టు వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 12 శాతం బలపడటంతో ఆయన వ్యక్తిగత సంపద పెరగడానికి దోహదం చేసిందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు కొద్ది దూరంలో నిలిచిపోయారు. రెండో స్థానంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. అంబానీ, అదానీల వ్యక్తిగత సంపద 14.7 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది.
యువ బిలియనీర్ అరవింద్ శ్రీనివాస్
యువ బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్ నిలిచారు. శాన్ ఫ్రాన్సిస్సో కేంద్రంగా పనిచేస్తున్న ఏఐ స్టార్టప్ పర్ప్లెక్సిటీ(జెఫ్ బెజోస్ వెనుకుండి) కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉన్నది. వీరితోపాటు పలువురు యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం భారత్‌లో 229 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాది 205 మంది ఉండగా, కొత్తగా 24 మంది జతయ్యారు.
దేశీయ శ్రీమంతుల మొత్తం సంపద ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. కిందటేడాది 941 బిలియన్ డాలర్లుగా ఉండేది.
వీరిలో టాప్-10 కుబేరులు 368 బిలియన్ డాలర్ల సంపదను కలిగివున్నారు. 2025తో పోలిస్తే వీరి సంపద 32 బిలియన్ డాలర్లు పెరిగింది.
దేశీయ బిలియనీర్ల సంపదలో మూడింట ఒకటో వంతు వీరి వద్దనే ఉన్నది.
మొత్తంగా 99 మంది దేశీయ బిలియనీర్ల సంపద పెరగగా..కొత్తగా 30 మంది ఈ జాబితాలోకి వచ్చారు.
గౌతమ్ అదానీ 63.8 బి.డాలర్లు
సావిత్రి జిందాల్ 39.1 బి.డాలర్లు
లక్ష్మీ మిట్టల్ 31 బి.డాలర్లు
శివ్ నాడర్ 30.9 బి.డాలర్లు
సైరస్ పూనావాలా 27 బి.డాలర్లు
దిలీప్ సంఘ్వీ 25.6 బి.డాలర్లు
కుమార మంగళం బిర్లా 21,1 బి.డాలర్లు
రాధాకిషన్ దమాని 15.7 బి.డాలర్లు
