Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

శ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనం

Ai generated article, credit to orginal website, March 13, 2026

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్ప యాగానికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 15న పుష్పయాగం సందర్భంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వ‌హంనున్న‌ట్లు తెలిపింది టీటీడీ. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంత‌రం సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చిపై స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.
ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగి పోతాయని విశ్వాసం. మార్చి 14వ తేదీ నుండి శ్రీ‌నివాస మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించిర జేఈవో వీర‌బ్ర‌హ్మం. గృహస్తులు( ఇద్దరు) రూ.516/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చని తెలిపారు. పుష్ప యాగాన్ని పురస్కరించుకుని మార్చి 15న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
The post శ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post

Recent Posts

  • శ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనం
  • నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు స్థ‌లం కేటాయిస్తాం
  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సంజు శాంస‌న్ ను రాజులా చూసింది
  • అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్
  • జ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌విత

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes