Virosh | ఎంతోకాలంగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ ఉదయ్‌పూర్ హోటల్‌లో ఈ జంట ఘనంగా వివాహం చేసుకుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ప్రతి వార్త కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇటీవల రష్మిక తమ హల్దీ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలలో విజయ్, రష్మిక ఇద్దరూ రంగులతో తడిసిపోతూ ఎంతో ఆనందంగా కనిపించారు. హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నవ్వులు పూయిస్తూ సరదాగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ రష్మిక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. “హల్దీ రోజు నిజానికి హల్దీ ప్లస్ హోలీలా మారిపోయింది. మేమంతా రంగులతో పూర్తిగా తడిసి ముద్దయ్యాం. ఇప్పటికీ నా జుట్టులో కొంచెం ఎరుపు రంగు ఉంది. ఆ రోజు నా టీమ్ బ్రైడ్ అద్భుతంగా సపోర్ట్ చేయడంతో అన్ని గేమ్స్ నేనే గెలిచాను. విజ్జూ (విజయ్ దేవరకొండ) కూడా ఆ రోజు నా టీమ్‌లోనే ఉన్నాడు” అంటూ రష్మిక రాసింది.అలాగే పెళ్లి జరిగిన వెన్యూ గురించి కూడా రష్మిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో పెళ్లి జరగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఆ ప్రదేశంలోని వాతావరణం, సిబ్బంది, సేవలు, ఫుడ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పింది. తమ పెళ్లి విజన్‌ను డిజైనర్ అనామిక అద్భుతంగా నిజం చేసిందని కూడా రష్మిక పేర్కొంది. “మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడు మాత్రమే మొదలైంది” అంటూ ఆమె భావోద్వేగంగా రాసింది.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 26న తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినిమాల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ జంట మరోసారి కలిసి ‘రణబాలి’ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
View this post on Instagram
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
