Transco | హనుమకొండ, మార్చి 19: ‘అనుమతి లేనిదే ఆఫీసులో అడుగుపెట్టొద్దు.. ఒకవేళ ఆదేశాలను ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు’ ఇవీ ట్రాన్స్‌కో వరంగల్ జోనల్ కార్యాలయం లో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బందిపై వేలాడుతున్న ఆంక్షలు. దీనిపై చర్యలు తీసుకొనేందుకు ఏకంగా ఒక సర్క్యులర్‌నే జారీచేశారు. ఈ వివాదాస్పద సర్క్యులర్ తీసుకొచ్చిన ఆ చీఫ్ ఇంజినీర్, ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీరాంకుమార్ వింత పోకడలతో ఆ శాఖ ఉ ద్యోగులు, సిబ్బంది హడలెత్తుతున్నారు.
ఉద్యోగులు, కార్మికులు ఎలాంటి సమస్యలైనా కం ట్రోలింగ్ అధికారులకు మాత్రమే విన్నవించుకోవాలని, తన వద్దకు రావొద్దని, ఒకవేళ వస్తే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని బెదింపులకు పాల్పడుతున్నారని ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలు ప ట్టించుకోకుండా, కనీసం వినకుండా నిత్యం అవమానపరుస్తూ తమను మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అదరం ఐక్యంగా ఉద్యమించాల్సి వస్తుందని విద్యుత్తుశాఖ ట్రాన్స్‌కో వరంగల్ జోనల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. తమ స మస్యలు పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతోపాటు పరిష్కారమయ్యే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు వినేందుకు ఐఏఎస్ అధికారులే సాయంత్రం ఒక సమయం కేటాయిస్తారని, అలాంటిది అనుమతి లేకుండా అడుగుపెట్టొందని ఒక సీఈ అనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రోజువారీగా ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులకు నేరుగా చెప్పడం సహజమని, ఆ సర్క్యులర్‌తో చెప్పుకొనే అవకాశం లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉన్నదని వాపోతున్నారు. క్రమశిక్షణ కోసం సర్క్యులర్ తీసుకొచ్చినట్టు అధికారులు చెప్తున్నా.. తమపై ఒత్తిడిని పెంచేలా ఉన్నదని ఉద్యోగులు, కార్మికులు చెప్తున్నారు. ఆంధ్రా ఆధిపత్య భావజాలంతో ఇక్కడి ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుం డా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
సీఈ వైఖరిపై ఉద్యమానికి సిద్ధం
జోనల్ ఆఫీస్‌లో సీఈ వైఖరి మారకపోతే ఉద్యమం తప్పదని ఉద్యోగులు, కార్మికులు హెచ్చరిస్తున్నారు. సీఈ వ్యవహరిస్తున్న తీరు.. తమ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా భావించా ల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టర్లతో చే యించాల్సిన పనులను తమతో చేయించి, కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
స్వరాష్ట్ర సాధన అనంత రం సైతం ఆంధ్రా ప్రాంత అధికారులతో ఇ లాంటి చేదు అనుభవాలు ఎదురవడం బాధాకరంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా క్రమశిక్షణ మార్గదర్శకాల కోసం జారీచేసిన సర్క్యులర్.. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికుల ఆరోపణల విషయంపై ట్రాన్స్‌కో వరంగల్ జోనల్ సీఈ శ్రీరాంకుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. రొటీన్‌లో భాగంగానే సర్క్యులర్ ఇచ్చామని, ఆఫీసుకు వచ్చి మాట్లాడితే అన్ని చెప్తామనడం గమనార్హం.
