Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Hyderabad | హైదరాబాద్‌కు 18 బ్రిటన్ స్కూళ్లు.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు!

Ai generated article, credit to orginal website, March 21, 2026

హైదరాబాద్‌, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : యూకే (బ్రిటన్‌)కు చెందిన స్కూళ్లు హైదరాబాద్‌ నగరానికి రానున్నాయి. ఫ్యూచర్‌సిటీతోపాటు, ఓఆర్‌ఆర్‌ శివారు ప్రాంతాల్లో దాదాపు 18 బ్రిటన్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ స్కూళ్ల ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్‌లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ శశాంక, సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషన్‌ శ్రీజన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌, యూకే హైకమిషన్‌ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆయా స్కూళ్లకు అనుమతులిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రైవేట్‌ రంగంలో బ్రిటన్‌ స్కూళ్లకు రెడ్‌ కార్పెట్‌ పరచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు గల స్కూళ్ల పేరిట సర్కార్‌ వాటిని స్వాగతిస్తున్నది. రాష్ట్రంలోని సర్కార్‌ బడుల్లో విద్యార్థుల్లేక, ఎన్‌రోల్‌మెంట్‌ పడిపోయి నిర్వీర్యమవుతున్న ఈ తరుణంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు అనుమతించడంపై విద్యారంగ నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్
  • దేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదు
  • తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై ఈట‌ల గుస్సా
  • ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్
  • ప‌శ్చిమాసియా యుద్దానికి తాత్కాలిక విరామం

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes