Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం

Ai generated article, credit to orginal website, March 21, 2026

గాజువాక : ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను గాజువాకలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతంలో తాను రెండు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు చెప్పారు. పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం అందం సిద్ధిస్తుందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అత్యంత అవసరమని పేర్కొన్నారు. బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని అన్నారు. కలర్స్ సంస్థ సేవలు ఇప్పటికే అనేక మందిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు.
కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, గాజువాకలో బ్రాంచ్ ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందన్నారు. తాను ఇక్కడే గాజువాకలో టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో చదువుకున్నానని, గాజువాక వాసులకు ఎప్పుడు తన ప్రాధాన్యత సేవలు అందుతాయి అని చెప్పారు. అందరికీ ఉపయోగపడేలా బరువు తగ్గుదల గురించి తాము సేవలు అందించడం ఎంతో సంతోషం అన్నారు. పది మందికి ఉపయోగ పడేది అందరికీ ప్రయోజనకారిగా ఉండే విధంగా తమ సేవలు కొనసాగుతాయ‌ని చెప్పారు. శారీరకంగా ఒక బరువు తగ్గడం అనేది, 90 రకాల కు పైగా ఇబ్బందులు తగ్గిస్తుందన్నారు. తమ కలర్స్ లో 250 మందికి పైగా న్యూట్రిసినిస్ట్, 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు , 2000 మంది సుశిక్షితులైన టెక్నీషియన్స్ ఉన్నారని, 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.
The post గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు
  • గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
  • 9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి
  • ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes