Health Department | హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏండ్లకొ ద్దీ తిష్ట వేసిన ఈ అధికారులపై అవినీతి ఆరోపణలున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ జరుగుతున్నది. పేరుకు కిందిస్థాయి అధికారులైనా అన్నింటా ఆధిపత్యం చెలాయిస్తూ అందినకాడికి దండుకొని కీలకమైన ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు ముట్టజెబుతూ కమీషన్ ఏజెంట్లుగా మారిపోయారని సమాచారం. ఇలా వైద్యశాఖలో ఏ ఫైల్ కదలాలన్నా వీళ్ల కు డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని అక్కడి సిబ్బందే బాహాటంగా చెబుతుండటం వారి వసూళ్ల దందాకు అద్దంపడుతున్నది.
కీలక విభాగాల్లో ఇదీ పరిస్థితి!
టీవీవీపీలో ఇద్దరు కిందిస్థాయి అధికారు లు, డీఎంఈలో ఇద్దరు మహిళా అధికారు లు, టీజీఎంఎస్‌ఐడీసీలో మహిళా అధికా రి, మరో కిందిస్థాయి అధికారి పాతుకుపో యి వసూళ్లకు తెగబడుడుతున్నట్టు ఆరోపణలున్నాయి. డీహెచ్‌లో ఐదుగురు అధికారులు సిండికేట్‌గా ఏర్పడి వసూళ్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు తెలిసింది. హెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూలో సైతం కొందరు తిష్టవేసి ఎన్‌హెచ్‌ఎం నిధులతో పాటు సొంత శాఖ నిధుల్లో అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైద్యశాఖలో అవినీతి అధికారుల జాబితా నెల రోజుల క్రితం ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ బ్యాచ్ సెక్రటేరియట్ స్థాయిలో, వైద్యశాఖ పెద్దలకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పి యథాస్థానంలో కొనసాగుతున్నారని ఆరోపణలున్నాయి. ఎవరేం చేసినా కోఠి హెల్త్ క్యాంపస్‌లోనే కొనసాగుతామని తాము అడిగినంత చెల్లించాల్సిందేనని సిబ్బందిని ఈ బ్యాచ్ బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్ల బ్యాచ్‌ను బయటకు పంపితేనే వైద్యశాఖలో ప్రక్షాళన జరుగుతుందని, వీరి అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టిసారించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగోన్నతులు వచ్చినా వెళ్లకుండా..
వైద్యారోగ్యశాఖలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్), తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ), హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కొందరు అధికారులు ఏండ్లుగా పాతుకుపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ అధికారి అయినా ఒక సెక్షన్‌లో రెండేండ్లుగా మించి ఉండకూడదు. ఒకవేళ సదరు అధికారి పనితీరు బాగుంటే మాత్రం మరో ఏడాది ఎక్స్‌టెన్షన్ చేసుకునే వీలు కల్పించారు. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు ఏండ్లుగా పాతుకుపోయారు. ప్రమోషన్లు వచ్చినా అదే స్థానంలో కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తున్నది. ఇందు కు ఉన్నతాధికారులకు ప్రతిఫలంగా లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నా యి. ప్రమోషన్లు పొందితే వేలల్లో జీతం మాత్రమే పెరుగుతుందని, ఉన్న స్థానంలో ఉంటే లక్షల్లో దండుకోవచ్చని అధికారులు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలిసింది.
