పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తో పాటు పనుల వేగం పై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎం ఎల్ కాంతారావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని పనులు చేయాలన్నారు. ఆయన పోలవరం ప్రాజెక్ట్ సి ఈ ఓ యోగేష్ పైతాన్కర్ , నూతన సి ఈ ఓ గా నియమితులైన సంజీవ్ వోహ్రా, పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ కే రమేష్ తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పీ పీ ఏ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇక ముందు జరగాల్సిన పనులు, వాటికి సంబంధించిన ప్రణాళిక, ఎదురైతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమీక్షించారు. సుమారు ఐదు గంటలపాటు ఆయన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో గడిపారు.
పోలవరం ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అలా పూర్తి చేయటానికి రూపొందించుకున్న ప్రణాళిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ లో పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా అదే విధమైన ప్రణాళికతో పనులు చేయాలని కోరారు. ఇప్పటి వరకు ప్రతి క్షణం విలువైనదే, ఇక ముందు ఒక్క క్షణం వృధా అయినా దాని ప్రభావం ప్రాజెక్ట్ నిర్మాణం పై పడుతుంది, నిర్దేశించిన లక్ష్యాలు చేరలేరు అని అన్నారు. జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రతి రోజూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకుని పని చేయాలని సూచించారు.
The post పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
