హైదరాబాద్ : ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త , విమానయాన నిపుణుడు రేమండ్ గ్రూప్‌ను(Raymond Group) ఒక ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమను దిగ్గజంగా మలిచిన రేమండ్ గ్రూప్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా(87)(Vijaypat Singhania) మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమారుడు గౌతం సింఘానియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, ఆయన పద్మభూషణ్ (2006), టెన్జింగ్ నోర్గే జాతీయ సాహస పురస్కారం (2003) అందుకున్నారు.
గతంలో తన కుమారుడు గౌతమ్ సింఘానియాతో ఆస్తుల విషయంలో తీవ్రమైన న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌పత్ తన సొంత పరిస్థితిని ఒక గుణపాఠంగా ఉదహరిస్తూ.. తల్లిదండ్రులు తమ జీవితకాలంలో తమ ఆస్తి మొత్తాన్ని పిల్లలకు బదిలీ చేయవద్దని బహిరంగంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పించారు.
