Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Visakhapatnam | ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ప్రియుడు.. విశాఖలో దారుణం

Ai generated article, credit to orginal website, March 30, 2026

Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తుందని ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన రవీంద్ర ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహితురాలు మౌనిక (28)తో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మౌనిక డబ్బుల కోసం వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ప్రియురాలు మౌనికను ఆదివారం తన ఇంటికి రమ్మని పిలిచాడు, రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత డబ్బుల విషయంలో మరోసారి వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు.
ఆ తర్వాత మౌనిక మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తోంది.. అది తట్టుకోలేకనే మౌనికను హతమార్చానని రవీంద్ర వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మౌనిక తల మాత్రం మిస్ అయినట్లు సమాచారం.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి
  • స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్
  • Pic: Nani’s Candid Moment With Son Junnu
  • AR Murugadoss Lands into Trouble
  • Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes