Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

Ai generated article, credit to orginal website, March 30, 2026

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వ‌మే రాష్ట్రంలో వచ్చేలా కార్యకర్తలందరూ పనిచేయాలని, కూటమిలోని ఇతర పార్టీలతో కలుపుకు పోవాలని పిలుపునిచ్చారు. దోపిడి, విధ్వంసం జగన్ క్రెడిట్ అని, వాటిని చోరీ చేయాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స వేడుకలు పెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రజా సంక్షేమానికి పార్టీ కార్యకర్తలు నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారని అన్నారు స‌విత‌. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్దాంతంతో అన్నఎన్టీఆర్ ఇదే రోజు టీడీపీని స్థాపించారన్నారు. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. వారి నేతృత్వంలో టీడీపీ మరింత బలోపేతమైందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా టీడీపీ కార్యకర్తలు భుజాన ఉన్న పసుపు జెండాను దించని యోధులని మంత్రి సవిత కొనియాడారు.
The post మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post

Recent Posts

  • మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి
  • స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్
  • Pic: Nani’s Candid Moment With Son Junnu
  • AR Murugadoss Lands into Trouble
  • Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes