Dharmapuri Arvind | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా.? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్ గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరామచంద్రుడు బీజేపీ జాగీరా, మీ పార్టీలో రాముడికి సభ్యత్వం ఉన్నదా..? అని శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ మరోసారి చేసిన వ్యాఖ్యలకు అర్వింద్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్నాయి. శ్రీరాముడికి బీజేపీ మెంబర్‌షిప్ ఉన్నదని ఈ వీడియోలో అర్వింద్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారని, మరీ ఆ పార్టీకి సున్తీ అయిందా, ఒకవేళ కాకుంటే పోయి చేసుకోవాలని మహేశ్ కుమార్‌గౌడ్‌కు అర్వింద్ చురకలు అంటించారు.
