బెంగళూరు : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇస్తోంది. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ముంబే వేదికగా ముంబై ఇండియన్స్ జట్టును వారి స్వంత గడ్డపైనే ఓడించి విస్తు పోయేలా చేసింది. ఈ టోర్నీలో వరుస గెలుపులతో దూసుకు పోతోంది. ఇదే క్రమంలో ఇప్పటి వరకు ఆడిన లీగ్ మ్యాచ్ లలో ఒక్క రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లలో 8 పాయింట్లు సాధించింది. ఇక లక్నో ఈ ఓటమితో లక్నో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు విల విల లాడారు. హాజిల్ వుడ్ కళ్లు చెదిరే బంతులు వేశాడు. తను 20 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తే రసిక్ సలాం సూపర్ షో చేశాడు. తను 4 ఓవర్లలో కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు కూల్చాడు. లక్నో జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే చాప చుట్టేసింది లక్నో సూపర్ జెయింట్స్. మిచెల్ మార్ష్ 40, ముకుల్ చౌదరి 39 , ఆయుష్ బదోని 38 పరుగులు చేసినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ ఆడుతూ పాడుతూ ఛేదించింది లక్ష్యాన్ని. 15.1 ఓవర్లలో పని కానిచ్చేసింది.
The post ఆర్సీబీ అదుర్స్ లక్నో సూపర్ జెయింట్స్ బేవార్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
