హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్రంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఆదివాసీ కాన్సిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకుల భేటీ అయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెట్టారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. పెసా చట్టానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్ లోని రక్షణలను తొలగిస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదన్నారు కల్వకుంట్ల కవిత. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని నిలదీశారు కేంద్రాన్ని. దీని కారణంగా ఆదివాసీలు తాము ఆదివాసీలమని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడం తప్ప మరోటి కాదన్నారు కవిత. జనగణనలో తమది ఆదివాసీ మతం అని చెప్పుకునేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చాన్నారు. లేక పోఏ దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు కవిత.
The post ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
