న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం. అంతకు మించి తమ రాష్ట్రానికి చెందిన, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం కుర్రాడు సంజు శాంసన్ అంటే ఎనలేని ప్రేమ. తాజాగా ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో శాంసన్ సత్తా చాటాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ ను వంటి చేత్తో గెలిపించాడు. ఈ తరుణంలో టోర్నీలో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. ముంబైలో ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో తను 101 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 54 బంతులు మాత్రమే ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్సర్లతో హోరెత్తించాడు.
ఈ సందర్బంగా ఎంపీ శశి థరూర్ స్పందించాడు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు శాంసన్ గురించి. సంజులో ఏదో ఉంది, గాలిలో ఒక సొగసు, మణికట్టు కదలికతో, నిబ్బరమైన చూపుతో. టైమింగ్ సరిగ్గా కుదిరి బంతి వికెట్ను తాకినప్పుడు, మనమందరం చేయాలని కోరుకునే పనులను అతను చేస్తున్నాడని పేర్కొన్నాడు. జైపూర్ ప్రకాశవంతమైన వెలుగుల నుండి వాంఖేడే ఎండ వరకు, అతను ఒత్తిడిని పెంచి, ఆపై పరుగు లంకిస్తాడు. అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం. “చెపాక్” అయినా, “డర్బన్” అయినా, అతను ఆ నేలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. బలవంతంగా బాదడం గానీ, కష్టపడటం గానీ లేదు, కేవలం సునాయాసమైన గమనంతో, స్వచ్ఛమైన కాంతి రేఖలతో చిత్రించిన వంద పరుగులు. ఆ మైలురాయిని చేరుకోవడానికి ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చినా ,సంజు సాధించే అద్భుతానికి సాటి మరొకటి లేదని పేర్కొన్నాడు శశి థరూర్.
The post సంజు శాంసన్ శతకం అత్యద్బుతం : శశి థరూర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
