Mehreen Pirzada | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తన అభిమానులకు ఊహించని శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపించని ఈ హనీ పాప.. అకస్మాత్తుగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తితో ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన శైల్ ప్రాంతంలో వీరి వివాహం అత్యంత ప్రైవేట్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక సిక్కు సంప్రదాయం ప్రకారం ‘ఆనంద్ కరాజ్’ విధానంలో జరిగింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “26.04.26 #ArshDiMehr” అంటూ మెహ్రీన్ క్యాప్షన్ ఇచ్చింది.
లేత గులాబీ రంగు లెహంగాలో మెహ్రీన్ దేవకన్యలా మెరిసిపోగా, అర్ష్ గులాబీ షేర్వాణీలో ఎంతో హుందాగా కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు “ఫెయిరీ టేల్ వెడ్డింగ్” అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక అర్ష్ ఔలఖ్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా సమాచారం లేదు. ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా ప్రైవేట్‌గా ఉండటం విశేషం. అయితే ఆయన బయోలో కార్లు, ట్రావెల్, స్పోర్ట్స్, నెట్‌ఫ్లిక్స్ అంటే ఇష్టం అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ, ఎక్కడా ఈ విషయం బయటపడకుండా నేరుగా పెళ్లితోనే సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇక మెహ్రీన్ తన మెహందీ వేడుకలో తల్లి పెళ్లి నాటి లెహంగాను ‘గరారా’గా రీక్రియేట్ చేయించుకుని ధరించినట్టు పేర్కొంది. డిజైనర్ పునీత్ బాలానా రూపొందించిన ఈ దుస్తులు తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె తెలియజేసింది. పాత జ్ఞాపకాలను గౌరవిస్తూ మెహ్రీన్ తీసుకున్న ఈ నిర్ణయం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే 2021లో మెహ్రీన్, హర్యానా రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు నెలల్లోనే ఆ బంధాన్ని ముగించుకుంది. ఆ తర్వాత పూర్తిగా కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించింది పంజాబ్‌లో జన్మించిన మెహ్రీన్, 2016లో నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘హనీ ఈజ్ బెస్ట్’ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
View this post on Instagram
A post shared by MEHREEN (@mehreenpirzadaa)
