అమరావతి : పదో తరగతి ఫలితాల్లోనూ మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు (ఎంజేపీ) విద్యార్థులు సత్తాచాటారు. 96.02 శాతం సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ప్రభుత్వ పరిధిలో నడిచే విద్య సంస్థలు, గురుకులాల్లో ఎంజేపీ గురుకులాలు ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు వంద బీసీ గురుకుల విద్యా సంస్థలు హాజరుకాగా, 32 గురుకులాల్లో వంద శాతం మేర ఫలితాలు రావడం విశేషం. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ గురుకులాలు 10 శాతం కంటే అధికంగా ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై, ఏప్రిల్ రెండో తేదీన ముగిశాయి. 6,18,131 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, 85.25 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మహత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు టెన్త్ లోనూ సత్తాచాటారు. ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇంటర్ లో 97 శాతం, సెకండ్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ బిడ్డలు ఉత్తీర్ణుత శాతం సాధించి భేష్ అనిపించుకున్నారు.
టెన్త్ లోనూ అదే స్థాయిలో ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంద ఎంజేపీ స్కూళ్లకు చెందిన 5,433 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 96.02 శాతం మేర ఉత్తీర్ణతా శాతంతో ఉత్తీర్ణులయ్యారు. విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం ప్రకారం 96.02 శాతంతో ద్వితీయ స్జానంలో ఎంజేపీ గురుకుల విద్యార్థులు నిలిచారు. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఎంజేపీ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. వంద బీసీ గురుకులాలకు చెందిన 5,501 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 96.02 శాతంతో 5,274 మంది మేర ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కు చెందిన విద్యార్థులు 96.04 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే 0.02 శాతంతో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు ముందంజలో నిలిచారు. టెన్త్ పరీక్షలకు 50 ఏపీ రెసిడెన్షియల్ కు చెందిన విద్యార్థులు 3,135 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఆ లెక్కన చూస్తే, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ విద్యార్థులే టాప్ లో నిలిచారు.
The post ఫలితాల సాధనలో బీసీ బిడ్డల హవా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
