శ్రీసిటీ : డేటా సెంటర్ల ఏర్పాటు కేవలం ప్రారంభం మాత్రమేనని, డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్క్ లో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్ కు శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఈ చరిత్రాత్మక సందర్భంగా మీ ముందుకు రావడం గౌరవంగా ఉందన్నారు. ఈ రోజ మనం కేవలం ఒక ప్రాజెక్ట్ ను ప్రారంభించడమే కాదు. భారతదేశ డిజిటల్, ఏఐ అభివృద్ధిని ఆవిష్కరిస్తున్నాం అన్నారు. ముందుగా క్యారియర్ గ్లోబల్ సంస్థ నాయకత్వానికి, ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్ కు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. క్యారియర్ అనేది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదన్నారు. ప్రపంచంలో కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువ చ్చిన సంస్థ. ఆధునిక ఎయిర్ కండిషనింగ్ ను ఆవిష్కరించడం నుంచి.. 50 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన గ్లోబల్ శక్తిగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందు వరుసలో నిలిచిందన్నారు. ఈ రోజు ఆ ఆవిష్కరణ ఏపీకి వస్తోందన్నారు లోకేష్.
క్యారియర్ సంస్థ ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 3వేల ఉద్యోగాలను కల్పించనుందని ప్రకటించారు. క్యారియర్ రావడం రాష్ట్రం పట్ల, మన ఎకోసిస్టమ్, మన ముఖ్యమంత్రి విజన్ పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు లోకేష్. శ్రీసిటీ కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే కాదు.. ఇదో గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్. 8,500 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. 31 దేశాల నుంచి 250కి పైగా కంపెనీలు శ్రీసిటీలో ఉన్నాయి. ఇక్కడి నుంచి 6 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. 70వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. వీరిలో సగం మంది మహిళలు ఉన్నారని అన్నారు. ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు.. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ప్రిసిషన్ ఇంజనీరింగ్ వరకు శ్రీసిటీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమ నమూనాగా నిలుస్తోందని చెప్పారు. ఈ రోజు మరో గొప్ప ఘనతను తన ఖాతాలో వేసుకుందని అన్నారు.
The post గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా శ్రీసిటీ – లోకేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
