AI Crime: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని మిస్ యూజ్ చేస్తే వచ్చే పరిణామాల గురించి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా దీనికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక ఐటీ విద్యార్థి ఏకంగా 30 మంది మహిళా విద్యార్థుల పోర్న్ చిత్రాలను, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేయడానికి ఏఐని వాడాడు. నిందితుడైన స్టూడెంట్‌ను అధికారులు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. బిలాస్‌పూర్ చెందిన వ్యక్తి నయా రాయ్‌పూర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Read Also: Bengaluru: ‘‘ఆజాద్ కాశ్మీర్’’ టీషర్ట్ వేసుకున్న స్టూడెంట్.. కేసు నమోదు..
సోమవారం 36 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన స్టూడెంట్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 6న కొంత మంది మహిళా విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నిందితుడి గదిలో సెర్చ్ చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నట్లు విద్యా సంస్థ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చెప్పారు. దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. విషయం లీక్ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మహిళా స్టూడెంట్స్‌కు సంబంధించి 1000 కన్నా ఎక్కువ ఫోటోలు, వీడియాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి ద్వారా ఏదైనా పోర్న్ కంటెంట్ క్రియేట్ చేశాడా..? క్యాంపస్ వెలుపల షేర్ చేశారా..? అని ధ్రువీకరించడానికి సైబర్ నిపుణులతో సమన్వయం చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక చర్యలు తీసుకునేందుకు లిఖిత పూర్వక ఫిర్యాదు కోసం చూస్తున్నామని రాఖీ పోలీస్ స్టేషన్ అధికారి ఆశిష్ రాజ్‌పుత్ తెలిపారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.
