అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
Also Read : BharthaMahasayulakuWignyapthi : రవితేజ ‘భర్త మహశయులకు విజ్ఞప్తి’ ఓవర్సీస్ రివ్యూ..
భారీ అంచనాల నడుమ ‘అనగనగా ఒక రాజు’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు మారి మాట్లాడుతూ ‘మేము ఇప్పటికే సినిమాని చాలాసార్లు చూసుకున్నాము. అలాగే చిత్ర బృందంలో భాగంకాని కొందరికి ప్రత్యేక షోలు వేసి సినిమా చూపించాము. వారు సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. అలాగే భావోద్వేగ సన్నివేశాలు చూసి హత్తుకున్నారు. సినిమా అయిపోగానే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇలాంటి స్పందన చూసి మాకు చాలా సంతోషం కలిగింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమా అనేది మా రెండేళ్ల ప్రయాణం. మా టీంతో సంబంధం లేని వ్యక్తులు.. సినిమా చూసి అంతగా ఎంజాయ్ చేశారంటే.. పండగకు మీరందరూ కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో మా సినిమాకి వచ్చి రచ్చ రచ్చ చేయండి. నా సినిమాల్లో మీరు కోరుకునే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. అలాగే అందమైన ఎమోషనల్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తూ మా టీం అంతా కంటతడి పెట్టుకున్నాము. మీరు టికెట్ బుక్ చేసుకొని జనవరి 14న థియేటర్ కి రండి.. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాదని అన్నారు.
