Ancient Temple Turkey: ఒక ముస్లిం దేశంలో తాజాగా పురాతన దేవాలయం బయటపడింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. తుర్కియే. ఆ దేశ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన తవ్వకాల్లో మాతృ దేవతకు అంకితం చేయబడినట్లు భావిస్తున్న 2,700 ఏళ్ల పురాతన ఆలయాన్ని గుర్తించారు. ఆధునిక నగరమైన డెనిజ్లీ సమీపంలో ఈ ఆలయం బయటపడింది. ఈ దేవాలయాన్ని 1200 BC – 650 BC మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన ఫ్రిజియన్ రాజ్యం నిర్మించిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
READ ALSO: PM Modi-Keir Starmer: బీచ్ ఒడ్డున మోడీ-స్టార్మర్ ముచ్చట్లు.. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు
ఒక ప్రధాన దేవతగా పూజలు అందుకుంది..
ఫ్రిజియన్ నాగరికత సంతానోత్పత్తి, ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక ప్రధాన దేవతను పూజించింది. ఆమెను “మాటెరాన్,” “మాటర్,” “సైబెలే” వంటి వివిధ పేర్లతో పిలిచేవారు. తరువాత గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా ఈ దేవతను పూజించాయని చెబున్నారు. లైవ్ సైన్స్ నివేదికల ప్రకారం.. పాముక్కలే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బిల్గే యిల్మాజ్ కోలాన్సీ ఈ తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ పవిత్ర స్థలంలో ఒక స్మారక చిహ్నం, పవిత్ర గుహ, రెండు నిర్మాణాల మధ్య ఉన్న జంట రాతి విగ్రహాలు బయటపడ్డాయి .” ఈ విగ్రహాలు పర్వత శిఖరాలపై చెక్కబడినట్లు ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి. ఇక్కడ పురాతన మతపరమైన ఆచారాలలో ద్రవాలను అందించడానికి ఉపయోగించే అనేక రాతి పాత్రలు (లిబేషన్ బౌల్స్), డ్రైనేజీ కాలువలు గుర్తించినట్లు తెలిపారు.
కొండపై నిర్మించిన ఆలయం..
ఈ ప్రదేశం సుమారు 2,800 నుంచి 2,600 సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి “మాతృ దేవత”తో సంబంధం కలిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లిన్ రోలర్ మాట్లాడుతూ.. “ఈ ప్రదేశం ఫ్రిజియన్ సంస్కృతి, ఇతర పవిత్ర స్థలాల మాదిరిగానే కనిపిస్తుంది. జంట విగ్రహాలను గుర్తించినప్పటికి, వాటి నిర్మాణం మిడాస్ నగరం వంటి ప్రదేశాలలోని విగ్రహాల మాదిరిగానే ఉంటుంది.” అని అన్నారు. ఈ ప్రాంతం కొండ ప్రాంతంలో ఉంది, ఇది ఆ కాలంలోని పవిత్ర స్థలాల సాధారణ లక్షణం అని ఆమె వివరించింది.
అయితే ఈ ప్రదేశం సంతానోత్పత్తి, పంట దేవత ఆరాధన కోసం ఉపయోగించారనే కథనాలు ఇప్పటికీ ఊహాజనితమే అని అన్నారు. “ఫ్రిజియన్ దేవత మాటర్‌ను ఎలా పూజించారో లేదా ఆమె భక్తులకు ఆమె ప్రాముఖ్యత ఏమిటో మాకు ఇంకా కచ్చితమైన ఆధారాలు లభించలేదు” శాస్త్రవేత్తల బృందం తెలిపింది. పురాతన హిరాపోలిస్, ప్రస్తుత పాముక్కలేకు సమీపంలో ఉన్న డెనిజ్లీ సమీపంలో ఆలయాన్ని గుర్తించారు. ఒక పురావస్తు మిషన్ గతంలో ఈ ప్రాంతంలో ఒక పురాతన ఫ్రిజియన్ ఆలయాన్ని కనుగొందని శాస్త్రవేత్తలు చెప్పారు.
READ ALSO: Nobel Peace Prize 2025: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు వచ్చే ఛాన్స్ ఉందా! రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
