AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొనింది. మధ్యాహ్నానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, గూడూరు, సూళ్లురుపేట, శ్రీకాళహస్తిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: Karthika Masam: నేడు కార్తీక మాసం ప్రారంభం.. గోదావరి నదికి పోటెత్తిన భక్తులు..
ఇక, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు, ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండరాదు అని సూచించారు. అలాగే, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలు సైతం పొంగి పోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
