APEPDCL : మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా (Montha) తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాలలో డివిజన్ వారీగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు టెలీకాన్ఫెరెన్స్ ల ద్వారా సూచనలు చేస్తున్నట్టు తెలిపారు.
APEPDCL Alert
సంస్థ పరిధిలోని అన్ని జిల్లాలలో డివిజన్, సెక్షన్ స్థాయి వరకు అధికారులందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, సెల్ టవర్లు వంటి అత్యవసర సేవలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 27, 28, 29 తేదీల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు తెలిపారు. తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ సమస్యల కోసం 1912 నంబర్‌కు సమాచారమివ్వాలని సూచించారు.
మొంథా తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్లు
విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం – 8331018762
కాకినాడ – 9493178718
పెద్దాపురం – 9059034479
జగ్గంపేట – 9490610096
అమలాపురం – 9490610101
రామచంద్రపురం – 9493178821
రాజమహేంద్రవరం రూరల్ – 9490610003
రాజమహేంద్రవరం టౌన్ – 9490610855
నరసాపురం – 7382050943
నరసాపురం – 9490610151
భీమవరం – 9490610143
ఏలూరు – 9440904037
జంగారెడ్డిగూడెం – 9491030712
అనకాపల్లి – 9490610023
కశింకోట – 8333811271
కశింకోట – 8333811272
నర్సీపట్నం – 9491030723
పాడేరు – 9440812511
రంపచోడవరం – 9059194449
విశాఖపట్నం
జోన్–I – 9490610018
జోన్–II – 9490610020
జోన్–III – 9491030721
శ్రీకాకుళం – 9440635529
టెక్కలి – 9490610050
పలాస – 7396615568
పలాస – 6281655632
పలాస – 9550568756
పలాస – 7981310114
పాలకొండ – 8332843546
పార్వతీపురం – 9492016109
విజయనగరం టౌన్ – 8465090654
విజయనగరం రూరల్ – 8332826430
మొంథా తుపాను నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు
మొంథా (Montha) తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే విద్యా శాఖ అధికారులతో సమీక్షాసమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలను మూసివేయనున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్‌వాడీలకు ఈ నెల 27,28 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ జారీ చేశారు.
అనకాపల్లి జిల్లాలో స్కూల్స్ బంద్
మొంథా (Montha) తుఫాన్ ప్రభావం దృష్ట్యా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు.
ప్రయాణాలు చేయొద్దు – కలెక్టర్ చదలవాడ నాగరాణి
మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంత ప్రజలకు మొంథా (Montha) తుపాను నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పలు సూచనలు చేశారు. తుపాను పరిస్థితుల దృష్ట్యా ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు ప్రాంతాల్లో తిరగవద్దని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే బీచ్‌లు, పర్యాటక రిక్రియేషన్ సంబంధిత కార్యకలాపాలను నిలిపివేసినట్లు గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆజ్ఞాపించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచించారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలని దిశానిర్దేశం చేశారు. రేపు(సోమవారం) నిర్వహించిన పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
Also Read : CM Chandrababu: మొంథా తుపాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం – సీఎం చంద్రబాబు
The post APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
