Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

April 1 New Rules | ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులు.. మీకు తెలుసా!

Ai generated article, credit to orginal website, March 30, 2026

April 1 New Rules | న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 మొదలుకాబోతున్నది. పాన్‌ కార్డ్‌ దరఖాస్తు నుంచి రైల్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌ వరకు వివిధ అంశాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..
కొత్త ఆదాయ చట్టం
ఐటీ యాక్ట్‌, 1961 స్థానంలో కొత్త చట్టం ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
పాన్‌ రూల్స్‌
ఇంతకుముందు పాన్‌కార్డు పొందాలంటే ఆధార్‌ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, బర్త్‌ సర్టిఫికెట్‌ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
రూ.10 లక్షలు దాటితే
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్నా పాన్‌ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది.
క్యాన్సిలేషన్‌ నిబంధనలు
రైల్వే టికెట్‌కు సంబంధించి క్యాన్సిలేషన్‌ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్‌ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. ఇంతకుముందు ఇది 4 గంటలుగా ఉండేది.
హెచ్‌ఆర్‌ఏ 50 శాతం
ఇంటి అద్దె భత్యం కింద మూల వేతనంలో 50 శాతం పన్ను మినహాయింపు పొందే నగరాలను కేంద్రం 4 నుంచి 8కి పెంచింది. ఇదివరకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైకి ఈ ప్రయోజనం పరిమితం కాగా, తాజాగా హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరుకూ విస్తరించింది.
ఎల్పీజీ ధరల సవరణ
ఏప్రిల్‌ 1 నుంచి ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరలను కేంద్రం మరోసారి సవరించే అవకాశముంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి
  • స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్
  • Pic: Nani’s Candid Moment With Son Junnu
  • AR Murugadoss Lands into Trouble
  • Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes