Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే అతను అయితే హైట్ పరంగా, బాడీ పరంగా ప్రభాస్ కు సరిగ్గా సరిపోతాడని రాజమౌళి ఆలోచించారు. కానీ అతనుకోకుండా ఈ పాత్ర రానా వద్దకు వెళ్లింది.
Read Also : Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక
ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. సేమ్ ప్రభాస్ కు పోటీ ఇచ్చే బాడీ రానా సొంతం. అందుకే ఈ పాత్రకు రానాను తీసుకున్నారంట. అందరూ అనుకున్నదానికంటే ఎక్కువగానే ఈ పాత్ర రానాకు సెట్ అయింది. ఈ పాత్రలో రానా తప్ప ఇంకెవరూ ఆ స్థాయిలో కనిపించలేరేమో అన్నంతగా రాణించారు రానా. ఆ పాత్రకే వైభవం తీసుకొచ్చాడు అని తెలిపారు శోభు యార్లగడ్డ. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పాత్రకు సరిపోయే వ్యక్తికే అది దక్కింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..
