బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు.  ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్ క్రియేట్ చేస్తోంది. బాహుబలి ఎపిక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తూ దూసుకెళ్తోంది. తెలుగు స్టేట్స్ కంటే ఒకరోజు ముందు ఓవర్సీస్ లో రిలీజ్ అయింది బాహుబలి. మరి ఎపిక్ రివ్యూ ఎలా ఉందొ చూద్దామా..
ఫస్ట్ హాఫ్ : ఎపిక్ టైటిల్ కార్డ్ తోనే మనం రొటీన్ రెగ్యులర్ రీరిలీజ్ చేయడం లేదని అర్ధం అవుతుంది. అక్కడి నుండి మిమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వదు. క్రిస్పీ ఎడిటింగ్ తో సినిమాను జెట్ స్పీడ్ లో పరిగెత్తించాడు జక్కన్న. పదేళ్ల తర్వాత కూడా అదే సౌండ్ అంతే అద్భుతమైన క్వాలిటీ. ముఖ్యంగా మహేంద్ర బాహుబలి మొదటిసారి మాహిష్మతిలోనికి ప్రవేశించినప్పుడు మరియు భల్లాలదేవుడి గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఫైట్ సమయంలో వచ్చే సీన్స్, మ్యూజిక్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. అనుష్క ఎంట్రీ సీన్ కు సూపర్బ్. ఇక కట్టప్ప బాహుబలిని పొడవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
సెకండ్ హాఫ్ : ఫస్టాఫ్ ను రేసీగా నడిపిన జక్కన సెకండాఫ్ లో డ్రామా, యాక్షన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ టచ్ తో పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసారు. అమరేంద్ర బాహుబలి అనే నేను ఎపిసోడ్, తలను నరికే సన్నివేశం ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ మీరు ఊహించలేని గూస్ బమ్స్ తెప్పించే ఫీల్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నెవర్ బిఫోర్ ఎక్సపీరియన్స్ ఇచ్చే సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాన్ని వెండితెరపై కచ్చితంగా చూడాల్సిన సినిమా.
ఫైనల్లీ : BaahubaliTheEpic సెల్యులాయిడ్ పై రాజమౌళి సృష్టించిన అద్భుతం.. తప్పకుండా చూడవలసిన చిత్రం.
 Rating : 4/5  
