ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ తెలుగు ప్రేక్షకులలో పెద్ద క్రేజ్ సంపాదించాయి. వీకెండ్ అంటే కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్‌లో వచ్చాయో చూడడం అనేది ఒక ఫన్ రూటైన్‌లా మారింది. తాజాగా ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్న మరో ప్రత్యేక సినిమా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘బకాసుర్ రెస్టారెంట్’. చిన్న హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ అనుభవాన్ని అందిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పటివరకు 250 మిలియన్ స్ట్రీమింగ్ మిటిట్స్‌ను దాటింది.
Also Read: Pawan Kalyan : మళ్లీ వార్తల్లో పవన్–సురేందర్ రెడ్డి కాంబో.. ఈసారి ప్రాజెక్ట్ నిజమవుతుందా?
‘బకాసుర్ రెస్టారెంట్’ హారర్-కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందించబడింది. కథలో క్షుద్ర పూజల కారణంగా నిద్రలేని ఆత్మలు, వాటి ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బంది కర సంఘటనలు ప్రధానంగా ఉంటాయి. ఈ కథ ప్రత్యేకత.. మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న కమెడియన్ ప్రవీణ్ తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. సినిమా హారర్ అంశాలతో పాటు సరదా ఎలిమెంట్స్ అందించడం వల్ల, ప్రేక్షకులు మ్యూజిక్, సీన్స్, ఎఫెక్ట్స్‌లను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
