BC Bandh:రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది.. నేడు రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చింది.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రోడ్డుక్కుతున్నారు… రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో జరుగుతోన్న బీసీ సంఘాలు బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి..
