beetroot juice: బీట్రూట్ జ్యూస్ ని సరైన పద్ధతిలో తాగితే బరువు తగ్గడంలో నిజంగా మంచి సహాయం చేస్తుంది. ఇది లో కేలరీలతో పాటు పుష్కలంగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన శరీర డీటాక్స్, మెటబాలిజం వేగంగా జరగడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో తాగడం, ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిది.
ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి, మెటబాలిజాన్ని పెంచుతుంది. కొంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి, రోజుకు 1 గ్లాస్ 150–200 mlచాలు. ఎక్కువ తీసుకుంటే షుగర్ కంటెంట్ వల్ల సమస్యలు రావచ్చు. నిమ్మరసం – ఫ్యాట్ కట్ చేయడానికి సహాయపడుతుంది. ఆదా – మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. కరేపాకు లేదా పుదీనా ఆకులు – డీటాక్స్, రుచికి బాగా సహాయం.
వర్కౌట్ ముందు తీసుకుంటే ఉత్తమం, వర్కౌట్‌కు 30 నిమిషాల ముందు తీసుకుంటే శక్తిని ఇస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ మెరుగవుతుంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అతి తక్కువ కేలరీలు – బరువు పెరగకుండా సహాయం. రక్తహీనతను నివారిస్తుంది. డయాబెటిక్ వారు పరిమితంగా తీసుకోవాలి. డుపు సమస్యలు ఉంటే నీటితో కలిపి తాగాలి. ప్రతిరోజూ తీసుకోవడం కన్నా వారానికి 3–4 సార్లు తాగడం ఉత్తమం.
