Bengaluru: బెంగళూర్‌లో ఓ విద్యార్థి ‘‘ఆజాద్ కాశ్మీర్’’ మ్యాప్, జెండా ఉన్న టీషర్టును ధరించడం చర్చకు దారి తీసింది. నగరంలోని అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితుడిని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఇనాయత్ అమీన్‌గా గుర్తించారు. వివాదాస్పద టీషర్టు ధరించిన అమీన్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.
Read Also: Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
వీడియోలో కనిపిస్తున్న బైక్ నెంబర్ ఆధారంగా అతడిని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సెప్టెంబర్ 22న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయింది. అమీన్ ఎరుపు రంగు టీషర్టుపై ‘ ఆజాద్ కాశ్మీర్’ మ్యాప్, జెండాను ముద్రించి ఉంది. చొక్కాపై పాకిస్తాన్ జెండా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ కేసు విచారణపై అమీన్‌ను పోలీసులు పిలిచారు. అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. విచారణ పూర్తయిన తర్వాత చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఒక వేళ నేరం రుజువైతే ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడుతుంది. ఇదిలా ఉంటే, నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో మతం, భాష, నివాస స్థలం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించే లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన కారణంగా కేసు నమోదైంది. ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు.
