Big Breaking: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, 4 వారాల వ్యవధిలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సబబేనా అనే అంశంపై కోర్టు విచారణ జరిపింది. పిటిషన్లపై ప్రభుత్వం తరుఫున లాయర్లు వాదనలు వినిపించారు.
విచారణ అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది.
Shubman Gill: రోహిత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు పడుతుందని ముందే తెలుసు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
