Bihar Election Results 2025 LIVE Updates: ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.. మధ్యాహ్నం వరకు ఫలితాలు దాదాపు స్పష్టం అయ్యే అవకాశం ఉంది.. 38 జిల్లాల్లో, 243 అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు, ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు.. కౌంటింగ్ కేంద్రాల్లో రెండంచల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..
