Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

Ai generated article, credit to orginal website, November 12, 2025

 
 
బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా అధికార ‘ఎన్డీయే’కు బిహారీలు మరోసారి పట్టం కట్టనున్నట్లు పేర్కొన్నాయి. అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని తెలిపాయి.
బిహార్‌లో అధికార ఎన్డీయే 133-159 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేసింది. మహాగఠ్‌బంధన్‌కు 75-101 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీకి 0-5 స్థానాలు, ఇతరులు 2-8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.
దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీయేకు 145-160 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 73-91 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీయేకు 147-167, విపక్షాలకు 70-90 స్థానాలు, ఇతరులకు 2-8 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్‌ అంచనా వేసింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ కూడా ఎన్డీయేకు 133-148, విపక్షాలకు 87-102 సీట్లు, ఇతరులకు 3-6 వస్తాయని పేర్కొంది. జన్‌సురాజ్‌ పార్టీ 0-2 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి.
 
The post Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం
  • 1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం
  • సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు
  • వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం
  • ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes