Bihar polling : బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలివిడత పోలింగ్ కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాగఠ్‌బంధన్ నుంచి ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ-ఎంఎల్ 14 చోట్ల పోటీలో ఉన్నాయి. ప్రశాంత్‌కిషోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో బరిలో ఉన్నారు. తొలి విడతలో తేజస్వియాదవ్తోపాటు బీజేపీ నేత సామ్రాట్ చౌధరి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు బరిలో ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్ల భారీ క్యూలైన్లను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | #BiharElection2025 | People queue up at a polling booth in Vaishali as they await their turn to vote in the first phase of the Assembly polls. pic.twitter.com/ekQ2x9NvYg
— ANI (@ANI) November 6, 2025
#WATCH | #BiharElection2025 | People queue up at a polling booth in Vaishali as they await their turn to vote in the first phase of the Assembly polls. pic.twitter.com/qAfCzo5Uls
— ANI (@ANI) November 6, 2025
