బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ ‘మా కోసం వచ్చిన శ్రీ విష్ణుకి థాంక్స్. ‘మిత్ర మండలి’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రియదర్శి నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన వ్యక్తి. ‘మిత్ర మండలి’ చిత్రం చాలా బాగా వచ్చింది. దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్టైనర్. విజయ్, అనుదీప్, కళ్యాణ్, ఆదిత్య హాసన్ ఫ్రెండ్‌షిప్ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. విజేందర్ అన్న చాలా మంచి వ్యక్తి. భాను, కళ్యాణ్‌లకు థాంక్స్. మా సినిమా ట్రయిలర్ రిలీజ్ అయినపుడు ఎక్కడ నవ్వాలి అనే నెగిటివ్ కామెంట్ పెట్టారు. మా సినిమాకు రండి ప్రతీ సీన్‌కు నవ్వుతారు. నా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు ఆడాలి.. అన్నీ హిట్ అవ్వాలి. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. నేను ధర్మం వైపు ఉంటాను. అక్టోబర్ 16న రాబోతోన్న నాలుగు చిత్రాలు పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
