China viral News: అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఓ 82 ఏళ్ల బామ్మ.. బతికున్న 8 కప్పలను మింగింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. చైనాలో. గతంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే నాటు వైద్యం చేసే వారి వద్దకు వెళ్లే వాళ్లు. ఈ బామ్మ కథ తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అనే ఆశ్చర్యం వేయకమానదు. చైనా బామ్మ తన అనారోగ్యం నయం చేసుకోవాలని తనకు తానే నాటు వైద్యం చేసుకుంది. ఆమె చేసిన పనికి అనారోగ్యం తగ్గడం పక్కన పెడితే.. కాస్తోకూస్తో మంచిగా ఉన్న ఆరోగ్యం మరింత క్షీణించింది.
READ ALSO: Smriti Mandhana: చేసింది 23 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
కొంప ముంచిన నడుము నొప్పి..
చైనాకు చెందిన బామ్మ పేరు జాంగ్. వాళ్లది తూర్పు చైనా. 82 ఏళ్ల బామ్మ నడుము నొప్పితో బాధ పడుతోంది. డాక్టర్ల వద్దకు వెళ్లకుండా తన అనారోగ్యాన్ని తానే నయం చేసుకోవాలని నాటు వైద్యంతో చేసుకోవాలనుకుంది. దీంతో బామ్మ బతికి ఉన్న కప్పలను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని అనుకుంది. తన ఆలోచనను ఎవరితోనైనా చెప్పితే వద్దు అని వారిస్తారని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. బామ్మ వాళ్లు పట్టుకొచ్చిన వాటిలో మూడు కప్పలను ఒకరోజు.. మరుసటి రోజు మరో 5 కప్పలను బతికుండగానే మింగేసింది.
తర్వాత ఏమైందో తెలుసా..
కప్పలను మింగిన తర్వాత బామ్మకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. కప్పలను తిన్న తర్వాత జాంగ్‌కు మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. బామ్మ అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది. వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులు బామ్మ బాధ చూడలేక సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బామ్మ కొడుకు మాట్లాడుతూ.. కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని చెప్పారు. తర్వాత ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బామ్మను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో ఎక్కువ సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని పేర్కొన్నారు. కప్పలను మింగడంతో బామ్మ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్‌తో సహా పలు రకాల పరాన్నజీవులు ఆమె శరీరంలో ఉన్నాయని ఆసుపత్రి వైద్యుడు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత బామ్మను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
చైనాలో చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఇలాంటివి చేస్తారన్నారు డాక్టర్ వు జోంగ్‌వెన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి తీవ్రం అయ్యాక ఆస్పత్రులకు వస్తారన్నారు. అయితే ఇలా బతుకున్న జంతువులను తింటే.. పరాన్నజీవులను శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ఫలితంగా దృష్టి లోపం, ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లతో సోకుతాయని.. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా అవుతాయని వెల్లడించారు. వృద్ధుల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయని తెలిపారు.
READ ALSO: Nobel Peace Prize 2025: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు వచ్చే ఛాన్స్ ఉందా! రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
