సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం విచారణ జరుగుతున్న సమయంలో ఒక వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71) షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని బయటకు తీసుకుని పోయారు. ఈ ఘటనను ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా రాజకీయ నాయకులంతా ఖండించారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
తాజాగా ఇదే అంశంపై తొలిసారి గవాయ్ స్పందించారు. ‘‘ఇది మాకు మరిచిపోయిన అధ్యాయం’’ అని పేర్కొన్నారు. సోమవారం జరిగిన సంఘటనతో తాను.. సహచర జస్టిస్ కే.వినోద్ చంద్రన్ చాలా షాక్‌కు గురైనట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం ఇది మాకు మరిచిపోయిన అధ్యాయం అని తెలిపారు.
సీజేఐ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం కేసులు విచారిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఏం జరిగిందంటే..
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.
ఇది కూడా చదవండి: Virender Sehwag Wife: షాకింగ్.. బీసీసీఐ అధ్యక్షుడితో సెహ్వాగ్ సతీమణి డేటింగ్?
గవాయ్‌పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు. ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గవాయ్ వెటకారంగా మాట్లాడడం వల్లే తాను దాడి చేశానని రాకేష్ కిషోర్ తెలిపాడు.
