Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబుతో కేబినెట్ ఉపసంఘం భేటీ.. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ

Ai generated article, credit to orginal website, November 24, 2025

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల మార్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా, ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి భేటీ అయింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన పరిపాలనా, భౌగోళిక అంశాలను పరిశీలించింది. గతంలో ఒకసారి సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు, ప్రతిపాదనలను తెలియజేసింది.
Read Also: Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది..
అయితే, ఈరోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం సమావేశం కాబోతుంది. ఇందులో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం, ప్రజల డిమాండ్లు లాంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇక, ఈ నెల 28వ తేదీన జరిగే క్యాబినెట్‌ సమావేశంలో కొత్త జిల్లాలపై నిర్ణయాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం కలిగించేలా ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు
  • అధికారంలోకి వ‌స్తాం ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌లం
  • స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు
  • 3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes