యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో… అబుదాబీ ఛాంబర్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ 42 సీఈవో మాన్సూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం… అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చెప్పారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్‌ఓసీ ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం నెట్‌వర్క్ లంచ్‌లో పాల్గొంది.
 
అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు ముఖ్యమంత్రి. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అనంతరం అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో నెట్‌వర్క్ లంచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొన్నారు. నెట్‌వర్క్ లంచ్‌లో జీ-42 సీఈవోతో, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యూఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.
The post CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు – సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్  | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
