CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా CRDA నూతన భవనం ప్రారంభం కానుంది. ఉదయం 9.54 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఢీల్లీకి వెళ్లనున్నారు. ఇక, సీఆర్డీఏ కార్యాలయ భవనం 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. రూ. 257 కోట్ల ఖర్చుతో జీ. ప్లస్ 7గా నిర్మాణం చేపట్టారు. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణం జరిగింది. 300 వాహనాల వరకు పార్కింగ్ చేసే వెసులుబాటు కల్పించారు. ఇక, భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ A ఆకారం వచ్చేలా డిజైన్ రూపొందించారు. అలాగే, 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఐరన్ ను ఏర్పాటు చేశారు. గడిచిన 8 నెలలుగా నిర్విరామంగా నిర్మాణ పనులు చేశారు.
Read Also: Cricket Tragedy: చివరి బంతి వేశాడు, మ్యాచ్ గెలిపించాడు.. కానీ మైదానంలోనే మరణించాడు!
అయితే, ప్రతి రోజూ 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పని చేశారు. ఇకపై అమరావతి నుంచే కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్.. 2, 3, 5వ అంతస్తుల్లో CRDA కార్యాలయం, 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో ADCL కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఉండనున్నాయి.
