Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

CM Chandrababu: నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం – సీఎం చంద్రబాబు

Ai generated article, credit to orginal website, November 14, 2025

 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపైనా సమావేశంలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… విశాఖ అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతుందని అన్నారు. విశాఖ భవిష్యత్ నగరంగా మారుతోందని… దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నావీ కలసి పనిచేయాలని అన్నారు. విశాఖ నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని… ఇదే సమయంలో విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్‌గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనికి తూర్పు నావికాదళం సహకారాన్ని అందించాలని సీఎం కోరారు.
 
నావీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని… నావికా దళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నావీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం చంద్రబాబు వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు తెలిపారు.
 
ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటుపై ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
 
ఆంధ్రప్రదేశ్ లో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు.
 
కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.
 
 
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ
 
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్ లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృతంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పని చేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు.
ఇండో – తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాద రక్షల తయారీ కంపెనీ పౌ చెన్ గ్రూప్ ఫుట్ వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీకండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు సహకరించాలని కోరింది. ఓర్వకల్లు సమీపంలోనే ఇ-జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చింది. 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్ధ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, కాథోడ్ యాక్టివ్ మెటిరియల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతిపాదించింది.
వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు- ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని పేర్కోన్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడు రీజియన్లను కలుపుతూ ఈ రహదారి మార్గాలు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులకు వివరించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పాలసీలో భాగంగా ప్రోత్సాహాకాలకు సంబంధించిన నిర్ణయాలు త్వరలోనే కేంద్రం విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. తైవాన్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తయారు చేసేందుకు సిద్ధమని సీఎం వెల్లడించారు. తైవాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ సహకారం బాగుందని తైవాన్ బృందం కొనియాడింది.
 
The post CM Chandrababu: నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం – సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • 23 people killed in Goa nightclub fire
  • 23 people killed in Goa nightclub fire
  • From Village Leadership to State Power: How Sarpanches Shaped Karimnagar’s Political Legacy
  • From Village Leadership to State Power: How Sarpanches Shaped Karimnagar’s Political Legacy
  • Exclusive: Mahesh Babu’s Pay for Varanasi

Recent Comments

No comments to show.

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes