గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతోంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెలతో కలిసి మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం కేవలం కమర్షియల్ విజయానికే పరిమితం కాలేదు, ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుంది.
Also Read :Ganja Smuggling: పెద్ద ప్లానింగే.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్
ఈ సినిమా ద్వారా ఏకంగా 11 మంది నటులు, నలుగురు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్ థియేట్రికల్‌గా రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత నిర్మాతగా నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2ను కూడా నిర్మిస్తున్నారు. ఒకవైపు అవార్డులు గెలుచుకుంటూ, మరోవైపు విభిన్నమైన కథలతో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా నిహారిక తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు యదు వంశీతో మరోసారి చేతులు కలపడంతో వారి కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
