Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వాయుగుండం మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. సాయంత్రానికి తుఫానుగా బలపడే అవకాశం ఉండగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Read Also: Astrology: అక్టోబర్ 26, ఆదివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
అయితే, ప్రస్తుతానికి ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కి 550 కిలో మీటర్లు, చెన్నైకి 850 కిలో మీటర్లు, విశాఖపట్నంకి 880 కిలో మీటర్లు, కాకినాడకి 880 కిలో మీటర్లు, గోపాల్‌పూర్‌కి 960 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొనింది. వాయుగుండం ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ, మంగళవారం నాటి రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు.
