వచ్చే ఏడాది సినీ ప్రేమికుల కోసం నిజంగా టఫ్ పోటీ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే పలు భారీ సినిమాలు రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయ్. ఆ జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ సినిమాను ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యశ్ కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ డ్రామా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు రిలీజ్ క్లాష్ లేకుండా ముందుకు వెళ్తోంది అనుకునేలోపే, కొత్త ట్విస్ట్ వచ్చేసింది.
Also Read : Rashmika : “పిల్లల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్న” – రష్మిక మందన్నా స్పెషల్ స్టేట్‌మెంట్!
అదేంటంటే.. టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమా ‘డెకాయిట్’ని అదే రిలీజ్ డేట్‌కి ఫిక్స్ చేశాడు. దీంతో యశ్ – శేష్ సినిమాల మధ్య సూటిగా క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ కాంపిటీషన్ తెలుగు, హిందీ బాక్సాఫీస్‌ల్లో చర్చనీయాంశం కానుంది. యశ్‌కి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా, అడివి శేష్‌కి కూడా తెలుగులో బలమైన ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ పోటీ రెండు సినిమాలకు ఎక్సైటింగ్ టర్న్ అవుతుంది. ఇక ‘టాక్సిక్’ విషయంలో మాత్రం కొన్ని ఇన్నర్ టాక్స్ వినిపిస్తున్నాయి.. షూటింగ్ షెడ్యూల్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కొన్ని డిలేలు ఉన్నాయట. కానీ యష్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా అనుకున్న టైమ్‌కే వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి, 2025 లో ‘డెకాయిట్ vs టాక్సిక్’ బాక్సాఫీస్ వార్ ఖాయం! ఎవరి మాస్ డోస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.
