Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘ కల్కి 2’ ను మేకర్స్ రెడీ చేస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పడుకోణెని తొలగించడంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ కొనసాగుతుంది. కేవలం డేట్స్ సమస్యలే కాదు.. భారీగా రెన్యుమరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అంతే కాదు ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటాను.. తనతో పాటు తన 25 మంది సిబ్బంది కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె అడగటంతోనే వైజయంతీ మూవీస్ కల్కి2898AD సీక్వెల్ నుంచి తప్పించినట్లు ప్రకటించింది.
Read Also: Niharika NM: యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్ స్టోరీ
ఇక, స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా స్పందించింది. ‘ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పని చేస్తున్నారు. వీకెండ్ లో అసలు పనే చేయరు అని తేల్చి చెప్పింది. దీని గురించి ఎవరూ మాట్లాడరు.. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఇతర హీరోయిన్లు కూడా 8 గంటలు పని చేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు హెడ్ లైన్లలో కనిపించరు.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయాలని దీపిక డిమాండ్ చేసింది.
