దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల సంయుక్తంగా జరిపిన దాడిలో ఈ నలుగురు గ్యాంగ్‌స్టర్లు చనిపోయారు. అక్టోబర్ 22-23 మధ్య రాత్రి 2:20 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
గ్యాంగ్‌స్టర్లు వీళ్లే..
రంజన్ పాఠక్ (25)
బిమ్లేష్ ముహ్తూ అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25)
మునీష్ పాఠక్ (33)
అమన్ ఠాకూర్ (21)
ఈ నలుగురు బీహార్‌లో అనేకమైన తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీగా ఈ గ్యాంగ్ పిలువబడుతుంది. ఈ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. అమన్ ఠాకూర్‌ది ఢిల్లీలోని కరావాల్ నగర్.. మిగతా ముగ్గురిది బీహార్‌లోని సీతామర్హి నివాసితులు. ఈ నలుగురు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లుగా పోలీసులు గుర్తించారు. కుట్ర ఛేదించే క్రమంలో పోలీస్ బృందాలు గాలిస్తుండగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడడంతో పోలీసులు నలుగురిని హతమార్చారు.
#WATCH | Delhi | Visuals from the spot where, at 2.20 am, a shootout broke out between 4 accused persons and a joint team of Delhi police Crime Branch and Bihar Police on the Bahadur Shah Marg.
Ranjan Pathak (25), Bimlesh Mahto (25), Manish Pathak (33) and Aman Thakur (21) from… pic.twitter.com/bmMteajCyk
— ANI (@ANI) October 23, 2025
